
గుండెపోటుతో యువకుడు మస్కట్ లోని ఒమన్ లో మృతి చెందాడు. స్వగ్రామంలో అంత్యక్రియలు బుదవారం నిర్వహించారు. మండలంలోని కిందితందకు చెందిన బట్టు రాము(40) మస్కట్ లో మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం మస్కట్ లోని ఒమన్ లో విధులు నిర్వహిస్తుండగా ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడన్నారు. బుదవారం శవాన్ని స్వగ్రామానికి తీసుక వచ్చి అంత్య క్రియలు నిర్వహించారు. మృతునికి ఇద్దరు కుమారులు, బార్య ఉన్నారు.