మండలంలోని చీక్లి గ్రామంలో అప్పుల బాధతో గడ్డి మందు త్రాగి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం చిక్లీ గ్రామానికి చెందిన కారం మహేందర్ (45) కొత్త ఇల్లు కట్టుకోవడానికి అప్పులు చేశాడు. ఈ విషయంలో ఆర్థిక ఇబ్బందుల వలన గురువారం రాత్రి 11 గంటలకి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామన్నారు.