
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామ సమీపంలో దెయ్యాలవాగులు ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన నెలకొన్నట్లు పసర ఎస్ ఐ షేక్ మస్తాన్ తెలిపారు. ఎస్సై మస్తాన్ కథనం ప్రకారం బుధవారం ప్రాజెక్టునగర్ గ్రామానికి చెందిన వజ్జ సాంబశివరావు ఏలియాస్ దివాకర్ 38 సంవత్సరాలు పసర గ్రామంలో కార్పెంటర్ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పద్యానికి బానిసై ప్రతిరోజు విపరీతంగా త్రాగుతూ ఉండేవాడు ఈ క్రమంలో మద్యం సేవించి పసర గ్రామ సమీపంలోని దయ్యాలవాగు బ్రిడ్జి వద్ద ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోవడం జరిగింది. సమాచారం అందిన వెంటనే మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. రాత్రివేళ కావడంతో గాలింపు నిలుపు వేసి గురువారం ఉదయం గాలింపు చేపట్టగా సుమారు 12 గంటల ప్రాంతంలో మృతదేహం లభ్యమయింది. మృతుని తండ్రి వద్ద సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.