
నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి నుండి ఒక వ్యక్తి అదృశ్యమైనట్లు నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ విజయ్ బాబు బుధవారం తెలిపారు. నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా, పాల్వంచ మండలం, తెలుపుగొండ గ్రామం కు చెందిన మంగలి సంగయ్య వయసు 50 సంవత్సరాలు గత నాలుగు రోజుల నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు అడ్మిట్ అయి ఉన్నాడు. ఈ క్రమంలో తేదీ 16 సమయం ఉదయం ఏడున్నర గంటలకు బాత్రూం కి వెళ్ళొస్తానని అతని భార్యకు చెప్పి వెళ్లాడు. అయితే తిరిగి రాలేదు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి ఆచూకీ ఎక్కడ తెలియలేదు అన్నారు. ఈ విషయమై నిజామాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతనికి కళ్ళు త్రాగే అలవాటు ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అతను కోల ముఖము, చామన చాయ రంగు, తెలుగు లో మాట్లాడతారని కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు తెలిపారు. హాస్పిటల్ నుండి వెళ్ళినప్పుడు అతను బ్లూ కలర్ షర్ట్, లుంగీ కట్టుకున్నాడు.ఈ వ్యక్తి ఆచూకీ తెలిసినచో నంబర్ 8712659837 కి సమాచారం ఇవ్వగలరు అని నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలియజేశారు.