మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

నవతెలంగాణ – రామారెడ్డి
కృత్రిమ కళ్ళు తయారీకి వినియోగిస్తున్న మత్తుపదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిని మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసిన ఘటన రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎక్సైజ్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గాంధారి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి వద్ద నుండి కృత్రిమ కళ్ళు తయారీలో వినియోగించే క్లోరోఫామ్, డైజోఫామ్, ఆల్ఫా జోలం మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోగా, అతని దర్యాప్తు చేయగా, రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆకుల బైరగౌడ్, అతనికి విక్రయించినట్లు సామాజిక మాధ్యమంలో సాక్షాలు ఉండటంతో మంగళవారం అర్ధరాత్రి బైరా గౌడ్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేయగా, మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దర్యాప్తు ముమ్మరం చేసి బాధ్యులందరినీ అరెస్టు చేస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై విక్రమ్ తెలిపారు.