మద్యానికి బానిసై పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి..

నవతెలంగాణ- భువనగిరి రూరల్ 

మద్యానికి బానిసై పురుగుల మందు  వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వీరవెల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీరవెల్లి గ్రామానికి చెందిన బాత్కూరు విజయ్ రెడ్డి 30 సంవత్సరాలు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయి ఇంటికి రాకుండా తిరుగుతూ ఉండేవాడని, అలా చేయకూడదని చెప్పిన అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. కాగా గురువారం రోజున మద్యాన్ని సేవించి గ్రామస్తుల కు కనిపించకుండా పోయాడని శనివారం ఉదయం అనగా ఈ రోజున ఉదయం రాయగిరి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బుజ్జ నవీన్ జిపిఆర్ ఫంక్షన్ సమీపంలో చనిపోయాడని సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా అక్కడికి వెళ్లి చూడగా ఇఫ్కో ఎంసి,  కబుటో పురుగుల మందు సేవించి , చనిపోయినట్లు తెలిపారు. మృతుని  తండ్రి పద్మా రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై వి సంతోష్ కుమార్ తెలిపారు.