– డెలివరీ బాయ్ గా ఉంటూ సరఫరా చేస్తున్నట్టు గుర్తింపు
– తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు
– 15 గ్రాముల ఎండీఎంఏ, 22కిలో గంజాయి 71నైట్రోసేన్ టాబ్లెట్స్, 491గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం మాదాపూర్ డీసీపీ వినీత్
నవతెలంగాణ-మియాపూర్
డెలివరీ బాయ్ గా జీవన్ కొనసాగిస్తూ మత్తు పదా ర్థాలను సరిపడా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన సైబరాబాద్ పరిధిలో జరి గింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏ ర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్ వివరాలను వెల్లడించారు. షైక్ బిలాల్ అనే వ్యక్తి రాజమండ్రికి చెందినవాడు. ఈయన ఇంటర్మీడియట్‌లో ఈ గంజాయికు బానిసగా అయ్యాడు. కోవిడ్ తర్వాత హైదరాబాద్ వచ్చి జొమాటోలో డెలివరీ బాయ్ గా చేస్తు న్నాడు. 2,3 ఏండ్ల నుండి ఐటీ ఉద్యోగులకు గంజాయిని సప్లయు చేస్తున్నట్టు విచారణలో పోలీసులు తెలిపారు. షెక్ బిలాలా ఫోన్ కాంటాక్ట్ ద్వారా 40నుండి50 మంది కు గంజాయి, నైట్రోసేన్ టాబ్లెట్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. భాను తేజ అనే మరో వ్యక్తి డగ్స్ అమ్ముతు జూన్ నెలలో పట్టుబడి జైళ్లో ఉన్నాడు. ఇతనితో షైక్ బిలాల్ సంబంధాలు ఉన్నట్టు ఈ దందా నడిపిస్తు న్నట్లు తెలిపారు. ప్రధానంగా ఈయన కాంటాక్ట్‌లో ఉన్న కస్టమర్లు వివరాలను తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వ డం లేదా చట్టపరమైన చర్యలకు తమ ముందుకు వెళ్తామ ని తెలిపారు. డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై రాష్ట్ర పోలీ స్‌శాఖ సైబరాబాద్ పోలీసులు పెద్దఎత్తున దాడులను ని ర్వహిస్తున్నామని గుర్తుచేశారు. యువత ప్రజలు మత్తు వైపు వెళ్ళొద్దని డీసీపీ సూచించారు. అనుమానస్పద వ్య క్తులు కానీ ఇతర మత్తు పదార్థాల సరఫరా విషయంలో ఎలాంటి సమాచారమున్న వెంటనే సైబరాబాద్ పోలీస్ వాట్స్‌అప్ నంబర్ 8712671111 సమాచారం అంది ఇవ్వాలని ఆయన తెలిపారు. ఇప్పటికే అనేక ఐటి ఇతర రంగాల ప్రజలకు యువతకు మత్తుపై అవగాహనా కార్య క్రమాన్ని సైబరాబాద్ పోలీస్ తరఫున నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.