హోంగార్డ్స్ నీ రెగ్యులరైజ్ చేయగలరని విన్నవిస్తూ న్యాయమూర్తికి వినతి పత్రం

నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణాలో పనిచేస్తున్న హోంగార్డ్స్ అందరమూ తెలంగాణలో పనిచేస్తున్న హోమోడ్ద అరికీ రెగ్యులర్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు. జిల్లా ప్రధాన న్యాయమూర్తికి శనివారం కలిసి వినతిపత్రాన్ని హోంగార్డులు అందజేశారు. ఈ సందర్భంగా హోంగార్లు మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డ్స్ ఎదుర్కున్న దుర్భర పరిస్థితులను గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ  రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమరి సారధ్యంలో బంగారు తెలంగాణా నిర్మాణంలో కష్టపడి పనిచేస్తున్న హోంగార్డ్స్ యొక్క సేవలను గుర్తించి తమ యొక్క గౌరవ వేతనాన్ని పెంచిన ఘనత కేవలం మీకు మాత్రమే చెందుతుంది, కానీ కేవలం గౌరవ వేతన పెంపు మాత్రమే హోంగార్డ్స్ సమస్యలకు (ఉదా: ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, రిటైరమెంటు బెనిఫిట్స్, కారుణ్య నియామకాలు) పరిష్కారం కాదని తమరు గుర్తించి హోంగార్డ్స్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నామని స్వయంగా మీరే అసెంబ్లీ మరియు ఇతర సభలలో ప్రకటన చేశారు. కానీ ఏ కారణాల వల్లనో హోంగార్డ్స్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయినా గౌరవ ముఖ్యమంత్రి  ఇచ్చిన మాటను తప్పరని నమ్మకంతో, పూర్తి విధేయతతో తమ విధులను నిర్వర్తిస్తున్నాము అని తెలియజేశారు. బంగారు తెలంగాణాలో మీరు మాత్రమే నూ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించగలరని పూర్తి విశ్వాసంతో 17000 హోంగార్డ్స్ మరియు మా కుటుంబ సభ్యులు అందరమూ తమరితో మనవి చేయునది ఏమనగా, హోంగార్డ్స్ కు మీరు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానాన్న నెరవేరి మమ్ములను రెగ్యులరైజేషన్ చేయగలరని మిక్కిలి వినయముతో హోంగార్డ్స్ వారి కుటుంబ సభ్యులు ప్రధాన న్యాయమూర్తి ముందు వేడుకుంటున్నాము అని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి తమ ఆవేదనను తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచి తమను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.