
నవతెలంగాణ – నెల్లికుదురు
అక్కుపత్రాలు ఇచ్చిన పేద కుటుంబాలకు చెందిన ప్రజలకు ఇళ్ల స్థలాలు తక్షణమే కేటాయించాలని మహబూబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ వినతిపత్రాన్ని అందించినట్లు రామన్నగూడెం నిరుపేద ప్రజలు నరసయ్య ప్రభాకర్ రాములు పద్మ యాక లక్ష్మి నరసమ్మ మంజుల అంజమ్మ తెలిపారు ఆదివారం మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ గ్రామస్తులతో కలిసి వారి సమస్యలను మెల్లపిచ్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో ఇంటి స్థలాల కోసం నిరుపేదలకు పట్టాలిచ్చారు కానీ అట్టి స్థలాలకు హద్దులు నిర్వహించి ఇప్పటివరకు ఇవ్వలేదు అని అన్నారు. హక్కు పత్రాలు ఇచ్చిన లబ్ధిదారులకు వెంటనే వారికి కేటాయించిన స్థలాలలో ఒక్కొక్క ప్లాటుకు హద్దులు నిర్వహించి ఇవ్వాలని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ను గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన గ్రామస్తులు పద్మ యాకలక్ష్మి నరసమ్మ నరసయ్య ప్రభాకర్ రాములు కొంతమంది గ్రామస్తులతో కలిసి కోరినట్లు తెలిపారు. మాకు 1998వ సంవత్సరంలో మా రామన్నగూడెం గ్రామంలో 62వ సర్వే నెంబర్ భూమిలో మా గ్రామ ప్రజలకు 6o మందికి గతంలోనే హక్కు పత్రాలు ఇచ్చారని అన్నారు. వాటిని అధికారులు హద్దులు నిర్వహించకపోవడంతో మేము ఆ భూమిలో ఇండ్లు నిర్మించుకోలేకపోయామని తెలిపారు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కనుక మా పిల్లలు మేము ఉండడానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ చొరవ తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి భూములకు హద్దులు నిర్వహించి ఇంటి స్థలాలు ఇప్పించాలని కోరుతున్నాను తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజుల అంజమ్మ చంద్రయ్య వీరస్వామి తోపాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.