– తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ డిమాండ్
నవతెలంగాణ – అచ్చంపేట
జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించాలని, ఏజెన్సీ ప్రాంతంలో అన్ని శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను ఏజెన్సీ గిరిజనులచే భర్తీ చేయాలని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు దనసరి అనసూయ (సీతక్క) తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం మన్ననూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని వారు గిరిజన సంఘ నాయకులతో చెప్పారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఏజెన్సీ హక్కులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, ప్రభుత్వం గిరిజనుల పట్ల నిర్లక్ష్యం చేసిందని , అందుకే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం జరిగిందని 80 శాతం గిరిజనులు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ని వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అట్లాగే మిగతా శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను గిరిజనులచే భర్తీ చేయాలని అన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంత సమస్యను పరిష్కారం చేయకపోతే ఆదివాసి గిరిజన సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని శంకర్ నాయక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు సంతోష్ నాయక్, డాక్టర్ శ్రీనివాస రాథోడ్, రాజు, బాలు హనుమంతు కోటేష్ తదితరులు ఉన్నారు.