నవతెలంగాణ – ఆర్మూర్
బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతి రహిత, నిస్వార్థరంగా దేశాభివృద్ధికై చేస్తున్న కృషిని చూసి, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పార్టీ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషికి మెచ్చి ప్రముఖ వ్యాపారవేత్త, అంకాపూర్ వాసి అయిన పైడి రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరగానే కొందరు బెంబేలెత్తిపోయి, మైండ్ బ్లాక్ అయి రాకేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి సతీమణి అదేవిధంగా ఎంపీ అరవింద్ ఫోటోలను మార్ఫింగ్ చేసి వారి వ్యక్తిగత హీననకు గురి చేసినటువంటి వ్యక్తులపై దర్యాప్తు చేసి వారు ఎవరైనా రాజకీయాలకతీతంగా కేసులు బనాయించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున పోలీస్ అధికారులకు వినతిపత్రాన్ని శుక్రవారం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి, పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, పట్టణ కార్యదర్శులు ఖాందేశ్ ప్రశాంత్, పులి యుగంధర్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబీసీ మోర్చా పట్టణ కార్యదర్శి గటడి శివ తదితరులు పాల్గొన్నారు.