ఈనెల 26,27, 28న హైదరాబాద్లో జరగనున్న ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు భీమిడి మాధవరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు దాసరి సాయికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎక్స్పో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కు భీమిడి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వాళ్లు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఫోటో ఎక్స్పోకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, కుటుంబ భరోసా ఇంచార్జ్ సుదర్శన్జ్ ,ప్రవీణ్ , మలేష్ యాదవ్, పండుగ నాగేష్, పత్య నాయక్, నరసింహ, శ్రవణ్, ప్రశాంత్, గణేష్ ,బాబు, సాగర్, నవీన్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.