పల్లె మట్టి వాసన తెలిపే చిత్రం

A picture of the smell of village soilగ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్‌ పతాకంపై గరుడవేగ మేకింగ్స్‌ ప్రొడక్షన్‌ నెం.1 మంగళవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభ మైంది. ‘జబర్‌దస్త్‌’ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్‌ రాకేష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ‘గరుడవేగ’ అంజి ఈ చిత్రానికి దర్శకుడు. అనన్య కథానాయిక.తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్‌ కుమార్‌ క్లాప్‌ కొట్టగా, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి రోజా కెమెరా స్విచాన్‌ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించగా, సాయి కుమార్‌ మేకర్స్‌కి స్క్రిప్ట్‌ అందజేశారు. పల్లె మట్టివాసన తెలిపే సినిమాగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: జయలక్ష్మీ సాయి కుమార్‌, సంగీతం: చరణ్‌ అర్జున్‌, లిరిక్స్‌ : కాసర్ల శ్యామ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : బత్తుల మహేష్‌, రైటర్‌ : నవీన్‌ కోలా.