మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం

– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్
మెదక్ గడ్డమీద గులాబీ జెండా ఎగడం ఖాయమని మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఘన విజయం సాధిస్తాడని, నాడు ఫోన్ చేస్తే నీళ్లు వొచ్చేవి నేడు పంటలు ఎండిపోతున్న పట్టించుకోరా..మల్లనసాగర్, కొండపోచమ్మ ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లను విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు దాసరి బాలనర్స్ తల్లి దాసరి లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు.వారి కుటుంబాన్ని పరామర్శించారు. లింగారెడ్డి పల్లి గ్రామంలో కౌడగారి జగన్ రావు, మచ్చ దుర్గమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాలను పరామర్శించారు. దుర్గమ్మ మృతితో అనాధలైన ముగ్గురు చిన్నారులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. ఆరేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కర్రోళ్ల సత్యం తండ్రి కర్రోళ్ల బాలరాజ్ మృతిచెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అంటేనే బీఆర్ఎస్ కు అడ్డా అని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఘన విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు.కలెక్టర్ గా ఎంతో పరిపాలన అనుభవం ఉన్న వెంకట్రామిరెడ్డికి మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించడం జరిగిందన్నారు.తనకు ఎంపీగా రెండు మార్లు అవకాశం ఇస్తే ప్రజల ఆశీర్వాదంతో  ఘన విజయం సాధించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం దుబ్బాకలో భారీ మెజారిటీతో గెలిపించారన్నారు.త్వరలో జరుగబోయే ఎంపీ ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీ అందిస్తామన్నారు.పరిపాలన అనుభవం ఉన్న వెంకట్రామిరెడ్డికి పట్టం కడితేనే పార్లమెంటు లో మెదక్ ప్రజల గొంతుకైతాడన్నారు.వెంకట్రామిరెడ్డిని స్థానికేతరుడు అని విమర్శలు చేయడం సరికాదని, పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ఎక్కడి నుండైనా పోటీ చేసే అవకాశం ఉంటుందన్న విషయం వకీల్ సాబ్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో  కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని, సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంను కోరినా చర్యలు శూన్యమన్నారు.గతంలో ఒక ఫోన్ చేయగానే కాలువలకు నీళ్లు విడుదల చేసే వారని, నేడు పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.మెడి గడ్డ వద్ద తాత్కాలిక ప్రాతిపదికన కాఫర్ డ్యాం ఏర్పాటు చేసి,  నీళ్లు ఎత్తిపోసి రైతులకు నీళ్లు అందించాలన్నారు.రాజకీయాలు పక్కన పెట్టి  దెబ్బతిన్న పిల్లర్లకు శాశ్వతంగా ఉండేటట్లు మరమ్మతు చేయించాలన్నారు. నీళ్ళులేక ఇప్పటికే 15% పంట పొలాలు ఎండిపోయాయన్నారు.పంటలు పండాలి అంటే ఇంకో 45 రోజులు నీళ్ళు అవసరము ఉంటాయన్నారు.పరిస్తితి ఇలాగే ఉంటె పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.ఉన్న కాలువల ద్వారా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి, మిగతా కాలువల పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రాజకీయ కోణంలో కాకుండా ప్రజల కోసం పని చేయాలని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, తొగుట మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, నాయకులు రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి,ఇప్ప దయాకర్, సత్యం, జాఫర్, మధు, మురళి, తిరుపతి నరసింహులు, కల్లూరు శ్రీనివాస్, రాజు, షాదుల్లా, నందు, నగేష్, మల్లారెడ్డి, మల్లేష్, మాజీ సర్పంచ్ కరుణాకర్, మల్లేశం, మల్లా గౌడ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.