డేవిస్‌కప్‌లో సిద్ధార్థ్‌కు చోటు

A place for Siddharth in Daviscupన్యూఢిల్లీ: స్టాకహేోమ్‌ వేదికగా స్వీడన్‌తో జరిగే భారత డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూప్‌-1 పోటీలకు 29ఏళ్ల సిద్ధార్థ్‌ వైశ్వకర్మ చోటు దక్కించుకున్నాడు. సిద్ధార్త్‌తోపాటు సుమిత్‌ నాగల్‌, రామక్‌ కుమార్‌ రామనాథన్‌, శ్రీరామ్‌ బాలాజీ భారత డేవిస్‌ కప్‌ జట్టులో సభ్యులు. అలాగే ఆర్యన్‌ షా రిజర్వ్‌ ఆటగానికి చోటు దక్కించుకున్నాడు. కోచ్‌గా అశుతోష్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఆ పోటీల్లో సిద్ధార్థ్‌ బరిలోకి దిగితే అంతర్జాతీయ టెన్నిస్‌లో అతడు అరంగేట్రం చేయనున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్‌ కప్‌లో భారత్‌ 4-0తో గెలిచింది. ప్రస్తుతం భారత టెన్నిస్‌ జట్టుకు కోచ్‌గా ఉన్న రతన్‌ గుజరాత్‌లోని నోయిడా విన్నర్స్‌ టెన్నిస్‌ అకాడమీకి సేవలందించనున్నాడు. సెప్టెంబర్‌ 14, 15న భారత్‌-స్వీడన్‌ జట్ల మధ్య డేవికప్‌ టోర్నమెంట్‌ జరగనుంది.