– అర్హులను గుర్తించడానికే గ్రామ సభలు – తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అనర్హుల కే లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కిందని మండలంలోని గుర్రాల చెరువు లో జరిగిన గ్రామ సభలో మంగళవారం పలువురు పేదలు గ్రామ సభలో అధికారులు కు తమ గోడు వినిపించారు. ఈ గ్రామం సభకు హాజరైన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అర్హులను గుర్తించడానికే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి దరఖాస్తును స్వీకరిస్తామని, అర్హులు అయిన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. మండలంలో మొదటి రోజు దిబ్బగూడెం, గుర్రాల చెరువు, జమ్మిగూడెం, కేసప్పగూడెం, మద్ది కొండ, మొద్దులు మడ, పాతల్లిగూడెం, వేదాంత పురంలో గ్రామ సభలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా 1661 మందిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా1701 మందికి రేషన్ కార్డు లబ్ధిదారులుగా ఇందిరమ్మ ఇండ్ల మొదటి దఫా లబ్ధిదారులు గా 4664 మంది, రెండో దఫా 1026 మంది లబ్ధిదారులు గా అధికారులు గుర్తించారు. రైతు బరోసా కు 36832.89 ఎకరాలకు గుర్తించారు. 241.25 ఎకరాలను సాగేతర భూములుగా నమోదు చేసారు. ఈ గ్రామసభల్లో మండల ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఈవో సోడియం ప్రసాద్ రావు, ఏవో శివరాం ప్రసాద్, ఆర్.ఐ లు టి.క్రిష్ణ, పద్మావతి, డీటీ రామక్రిష్ణ, కార్యదర్శులు జగదీష్, కార్తీక్, సమ్మయ్య, స్వతంత్ర తేజ్, యాకూబ్ ఆలీ, స్వరూప లు పాల్గొన్నారు.