భిన్న కథతో చౌర్యపాఠం

భిన్న కథతో చౌర్యపాఠం‘ధమాకా’తో మ్యాసీవ్‌ బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన అప్‌ కమింగ్‌ క్రైమ్‌ కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్‌ బ్యానర్‌పై నిఖిల్‌ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్‌ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌. సురేష్‌ సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘తెలిసి తెలిసి’ పాటని విడుదల చేసి మ్యూజికల్‌ జర్నీని ప్రారభించారు మేకర్స్‌. డేవ్‌ జాంద్‌ ఈ పాటని సోల్‌ ఫుల్‌ మెలోడీగా కంపోజ్‌ చేశారు. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని మనసుని హత్తు కునే లిరిక్స్‌ అందించగా, శ్వేతా మోహన్‌, హరి చరణ్‌ తమ అద్భుతమైన వోకల్స్‌ తో ఆకట్టు కున్నారు. ఈ పాటలో ఇంద్ర రామ్‌, పాయల్‌ రాధాకష్ణ కెమిస్ట్రీ మెస్మరైజింగ్‌గా వుంది. విజువల్స్‌ చాలా ప్లజెంట్‌గా వున్నాయి. సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్ట మనేని ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించడంతో పాటు డీవోపీగా పని చేస్తున్నారు.