టాలెంట్‌కి పట్టం కట్టే వేదిక

A platform to crown talentహైదరాబాద్‌కు తలమానికంగా భాసిల్లుతున్న థ్రిల్‌ సిటీ – అమ్యూజ్మెంట్‌ థీమ్‌ పార్క్‌ సోషల్‌ మీడియా ప్రభావాశీలుర సృజనాత్మకతకు సవాలు విసిరింది. అసాధారణమైన, అద్భుతమైన అనేక విశేషాల సమాహారంగా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్న థ్రిల్‌ సిటీ – థీమ్‌ పార్క్‌లోని ఫన్‌ గేమ్స్‌, అడ్వెంచర్‌ గేమ్స్‌, హార్రర్‌ మేజ్‌, 12డి థియేటర్‌ లాంటి వందలాది యాక్టివిటీస్‌ని బేస్‌ చేసుకుని వీడియో రీల్‌ను చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోల నుంచి అత్యుత్తమమైన వీడియో రీల్స్‌ మూడింటిని ఎంపిక చేసి, లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల నగదు బహుమతులను అందించనుంది.
‘థ్రిల్లింగ్‌ ఇన్‌ఫ్లూయెన్‌సర్స్‌ ఛాలెంజ్‌’ ఈవెంట్‌ కర్టెన్‌ రైజర్‌ వేడుకకు హాజరైన హీరో విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ, ‘ప్రస్తుతం సోషల్‌ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపార రంగమంటూ ఏదీ లేదు. టాలెంట్‌ ఎవరి సొత్త్తు కాదు. క్రియేటివిటీ ఉన్న ప్రతీ ఒక్కరికీ సోషల్‌ మీడియా పట్టం కడుతుంది’ అని అన్నారు. ఈ ఈవెంట్‌ కో-ఆర్డినేటర్‌ ‘బందూక్‌’ లక్ష్మణ్‌ మాట్లాడుతూ, ‘మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి, ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలో లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తాం’ అని తెలిపారు.