క్రీడా మైదానం, గ్రంథాలయం ఏర్పాటు చేయాలి

– డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి
నవతెలంగాణ మల్హర్ రావు/కాటారం..
కాటారం డివిజన్‌ పరిధిలో క్రీడా మైదానం, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని, క్రీడాకారులకు ఉచితంగా క్రీడా కిట్లు ఇవ్వాలని,అలాగే పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని బుధవారం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో కాటారం సబ్ కలెక్టర్ మయ్యాంక్ సింగ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ నాయకులు మాట్లాడారు క్రీడలకు సంబంధించి కాటారం డివిజన్‌ పరిధిలో క్రీడాకారులు ఆటలు ఆడేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు తోపాటు,విద్యార్థులకు, విద్యావంతులకు, గ్రంథాలయము ఏర్పాటు చేయాలన్నారు.దీంతోపాటు కాటారం డివిజన్ పరిధిలో నివాసా లకు ఆనుకొని ఉన్న  వైన్ షాపును నివాసాలకు దూరంగా 200 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలన్నారు. మండల పరిధిలోని ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు.అనంతరం కలెక్టర్ ను శాలువతో సత్కరించారు.కార్యక్రమంలో.. ఎస్ఎఫ్ఐ  జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్, అఖిల్,తదితరులు పాల్గొన్నారు.