మండల కేంద్రంలోనీ ఎంపీడీఓ కార్యాలయంలో కుక్కల బెడద నుంచింప్రజల్ను కాపాడాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్లు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా నాయకులు కొండ గంగాధర్ మాట్లాడుతూ కేవీపీఎస్ సర్వే భాగంలో అనేక గ్రామాలు తిరుగుతున్న సందర్భంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు డెంగు, చలి జ్వరాలు, బోదకాలు సంబంధించిన వ్యాధులు ప్రబలి మామిడిపల్లి గ్రామస్తులందరూ అనేక బాధలు పడుతున్నారన్నారు. అదేవిధంగా పెద్ద గ్రామాలైన కల్లాడ, గుత్ప, మామిడి పల్లి గ్రామాలలో వారంలో ఒక్క రోజు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సీజనల్ వ్యాధుల నుండి ప్రజలు కాపాడాలనీ అన్నారు. అదేవిధంగా గ్రామాలు తిరుగుతున్న సందర్భంగా కుక్కలు ఎక్కువైయ్యాయని, అనేక మైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తున్నయని, విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్న సందర్భంగా వారి వెంట పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. కావున కుక్కల బెడదను నివారించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు మండల నాయకులు చిన్నయ్య, రాజు, మైపాల్, గంగాధర్, జగన్ పాల్గొన్నారు.