మెప్పించే సోలో బాయ్

‘సోలో బాయ్’ టైటిల్‌ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సోలో బాయ్ టైటిల్‌ సాంగ్‌ హుక్‌ స్టెప్‌ ఛాలెంజ్‌ గురించి మేకర్స్‌ తెలిపారు.
హుక్‌ స్టెప్‌లో మెప్పించిన వారికి మొదటి బహుమతిగా రూ.30,000, రెండవ బహుమతి రూ. 20,000 మూడో బహుమతి రూ.10,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. బిగ్‌ బాస్‌ 7 కంటెస్టెంట్‌ గౌతమ్‌ కష్ణ హీరోగా సెవెన్‌ హిల్స్‌ ప్రొడక్షన్స్‌ పై సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌ నిర్మాతగా పి. నవీన్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సోలో బాయ్’.
జుడా షాండి మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్‌ కొరియోగ్రాఫర్‌. ఈ సందర్భంగా నిర్మాత సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ”సోలో బాయ్’ సాంగ్‌ చూసిన అందరి నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డైరెక్టర్‌ నవీన్‌ సైలెంట్‌గా ంచి సినిమాను అందించాడు. నా తమ్ముడు గౌతమ్‌ కష్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. భవిష్యత్‌లో గౌతమ్‌ కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు’ అని అన్నారు.