నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బ్రిడ్జ్ ఇండియా సమావేశంలో ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం అంశంపై కీలకోపన్యాసం చేసేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం లండన్ బయల్దేరి వెళ్లారు. అక్కడ ఎన్‌ఐఎస్‌ఏయూ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొంటారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమ తీరుతెన్నులు, దీని ద్వారా లభించే ప్రయోజనాలు, చట్టసభల్లో ప్రజాస్వామ్య మహిళల భాగస్వామ్యం ఆవశ్యకత వంటి అంశాలపై ఆమె మాట్లాడతారు. అలాగే అక్కడి అంబేద్కర్ హౌస్ మ్యూజియంను సందర్శిస్తారు. మరుసటి రోజు శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అండ్ అలుమిని యూనియన్ యూకే నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.