సాయిచంద్‌ కుటుంబానికి కవిత పరామర్శ

– కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్సీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇటీవల గుండెపోటుతో మరణిం చిన తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌, ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శి ంచారు. గురువారం సాయిచంద్‌ నివాసానికి వెళ్లగానే ఎమ్మెల్సీ కవితను చూసి సాయిచంద్‌ భార్య భోరున విల పించారు. వారిని ఓదార్చే క్రమంలో కవిత సైతం భాగోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. చిన్న వయసు లోనే సాయిచంద్‌ మరణించడంపట్ల ఎమ్మెల్సీ కవిత విచారం వ్యక్తం చేశా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఎంతోమందిని చైతన్య వంతం చేశారని ఆమె గుర్తుచేశారు. అందరికీ ఆత్మీయుడు చనిపోయాడనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. సాయిచంద్‌ మరణం తీర ని లోటన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.