హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో ప్రేక్షకులని ఆలరించ బోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఒకప్పుడు బ్యాంకులు లేనప్పుడు మన దగ్గర వున్న డబ్బు, బంగారం ఒక బిందెలో పెట్టి భూమిలో దాచేవారు. ఈ కథలో యూనిర్సిటీలో చదువుకున్న ముగ్గురు ఓ గ్రామంలో అలాంటి గుప్తనిధుల కోసం చేసిన అన్వేషణ ఎలా జరిగిందనేది చాలా క్రేజీగా చూపించడం జరిగింది. ‘ఓం భీమ్ బుష్’ అనేది ఓ మ్యాజికల్ ఫ్రేజ్. చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు కూడా సరదా ఆ మాట వాడు తుంటారు. ఈ కథలో కూడా చాలా మ్యాజిక్ వుంటుంది. పారానార్మల్ యాక్టివిటీస్, ఆత్మలు, లంకె బిందెలు ఇలాంటి మిస్టీరియస్ ఎలిమెంట్స్ వుం టాయి. ఈ కథకు ‘ఓం భీమ్ బుష్’ అనేది యాప్ట్ టైటిల్.
ఇందులో కూడా కొంచెం స్టూడెంట్ ఎపిసోడ్ ఉంటుంది. పెద్ద యూనిర్సిటీలలో ముఫ్ఫై ఏళ్లకు దాటిన వారు కూడా ఏదో పీహెచ్డీ చేస్తూ అక్కడే వుంటారు. ఇందులో ముగ్గురు కూడా అలా యూనివర్సిటీలో రిలాక్స్‌గా వుండేవారే. అలాంటి ముగ్గురు బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది కథ. ఈ కథలో చాలా లాజిక్ వుంటుంది. ప్రతి సన్నివేశం లాజిక్‌తో ముడిపడి వుంటుంది. ఇందులో చాలా బలమైన కథ వుంది. కానీ ఇప్పుడు రివీల్ చేయడం లేదు. ఈ సినిమాకి కథే హైలెట్. ఇందులో మంచి ఎమోషన్ కూడా వుంది. అది చాలా కొత్తగా వుంటుంది. ఆ కొత్త పాయింటే సినిమాకి యూఎస్పీ. ఇలాంటి పాయింట్ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకూ రాలేదు. ఏ భాషలో చూసిన నచ్చుతుంది. ఇందులో హ్యూమన్ ఎమోషన్ కూడా ఆకట్టుకుంటుంది. చాలా క్లీన్ సినిమా ఇది. పిల్లలతో కలసి హాయిగా చూడొచ్చు.