
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో మెన్ రాధారి నడిరోడ్డులో భారీ గుంత పడింది. గుంత పక్కన వర్షపు నీళ్ళు నిలవడంతో ఈ గుంత మూలంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ఎవరో నడిరోడ్డు గుంతలో ప్రమాదాలు జరగకుండా సలాకు దిమ్మెను పెట్టారు. ఆ దివ్య కు కొమ్మలు కట్టారు. మేయిన్ రహదారి అయినందున ఇరువైపుల వెళ్లే వాహనదారులకు ఈ ప్రమాద సూచిక ఇబ్బందికరంగా మారింది. నడిరోడ్డులో గుంత పడటం ఆ గుంతలో ఇనుప కడ్డీ దిమ్మె పెట్టడం, గుంత పక్కన వర్షపు నీరు నిలవడం గుంత ఎలాంటిది అనేది వాహనదారులకు తెలియకపోవడం, ఒకే వైపున వెళ్లాలని ప్రయత్నంలో వాహనదారులు ఒకే సైడు నుండి వాహనాలు తీసుకువెళ్తున్నారు. నడిరోడ్డు గుంత ఎలాంటి ప్రమాదానికి గురి చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈ గుంత వెంటనే పూడ్చివేయాలని మద్నూర్ మండల కేంద్ర ప్రజలు రహదారి అధికారులకు కోరుతున్నారు.