షణ్ముఖలో శక్తివంతమైన పాత్ర

షణ్ముఖలో శక్తివంతమైన పాత్రవైవిధ్యమైన చిత్రాలను, విభిన్నమైన కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’. పవర్‌ఫుల్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్‌ కథానాయకుడు. అవికాగోర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. ‘శాసనసభ’ పాన్‌ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్‌ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాప్పని బ్రదర్స్‌ సమర్పణలో తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్‌ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న అవికాగోర్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె లుక్‌ను రివీల్‌ చేస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ,’ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. విజువల్‌ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో కథానాయిక అవికాగోర్‌ ‘సర’ పాత్రలో సాహసోపేతమైన పనులు చేసే శక్తివంతమైన అమ్మాయి పాత్రలో కనిపించనుంది. లక్ష్య సాధనలో ఆది పాత్రకు సపోర్ట్‌ చేస్తూ ఆయనకు తోడుగా నిలిచే పాత్ర. తప్పకుండా ఈ చిత్రం ఆది, అవికాగోర్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది’ అని అన్నారు.