కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదివారం ఈ మూవీలో పవర్ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ మాళవికా నాయర్ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మణిమేకల పాత్రలో మాళవికా నాయర్ కనిపించనున్నారు. ఆమె లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. డిఫరెంట్ హెయిర్ స్టైల్లో కనిపిస్తున్నారు. మైకు ముందు నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు ఉంది. అయితే ఆమె పాత్రకు ఈ సినిమాకు కథకు ఉన్న లింకేంటనేది తెలుసుకోవాలంటే మాత్రం నవంబర్ 24న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సినిమాను చూడాల్సిందే నంటున్నారు నిర్మాతలు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. ‘డెవిల్’ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని
ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ ఆకట్టుకోబోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ ఇండిస్టీలో వన్ ఆఫ్
ది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ‘డెవిల్’తో అలరించడానికి రెడీ అవుతున్నారు.
దేవాన్ష్ నామా సమర్పకుడిగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక, నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు.