పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌..

పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌..తన కెరీర్‌లో పోషించిన అద్భుతమైన ఇంటెన్స్‌ క్యారెక్టర్స్‌తో లేడీ సూపర్‌ స్టార్‌గా విజయశాంతి పేరొందారు. చాలా కాలం తర్వాత ఆమె నందమూరి కళ్యాణ్‌ రామ్‌ చిత్రానికి సైన్‌ చేశారు. ఇందులో ఆమె ‘కర్తవ్యం’ తరహాలో నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. విజయశాంతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ద్వారా ఆమె పాత్రను వైజయంతి ఐపీఎస్‌గా పరిచయం చేశారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తోనే ఆ పాత్ర ఎంత పవర్‌ ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. మేకర్స్‌ క్యారెక్టర్‌ని పరిచయం చేయడానికి ఒక గ్లింప్స్‌ కూడా రిలీజ్‌ చేశారు. ‘వైజయంతి ఐపీఎస్‌… తను పట్టుకుంటే పోలీస్‌ తుపాకికే ధైర్యం వస్తుంది… వేసుకుంటే యూనిఫాంకే పౌరుషం వస్తుంది… తానే ఒక యుద్ధం… నేనే తన సైన్యం…” అంటూ కళ్యాణ్‌ రామ్‌ వాయిస్‌ ఓవర్‌తో క్యారెక్టర్‌ని ప్రజెంట్‌ చేయడంతో అదిరిపోయింది. కళ్యాణ్‌ రామ్‌ కూడా వీడియోలో ఫెరోషియస్‌గా కనిపించారు. ప్రదీప్‌ చిలుకూరి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో బిగ్‌ స్కేల్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో సోహెల్‌ ఖాన్‌, సయీ మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, డీవోపీ : రామ్‌ ప్రసాద్‌, ఎడిటర్‌: తమ్మిరాజు, స్క్రీన్‌ ప్లే: శ్రీకాంత్‌ విస్సా.