గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై రాకింగ్ రాకేశ్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘కెసిఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) అనే పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్‌తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. తెలంగాణ బంజారా (తాండ) నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనన్య హీరోయిన్‌గా నటిస్తోంది.