శక్తివంతమైన మహిళ పాత్ర..

Powerful woman character..హీరో రాజ్‌ తరుణ్‌ నటించిన న్యూ ఏజ్‌ ఎంటర్‌టైనర్‌ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి జె. శివసాయి వర్ధన్‌ డైరెక్టర్‌. దర్శకుడు మారుతి ప్రజెంట్‌ చేస్తున్నారు. మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ హీరోయిన్‌ అభిరామి కీలక పాత్ర పోషించారు. ఈనెల 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిరామి మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
– మహారాజ, సరిపోదా శనివారం లాంటి సూపర్‌ హిట్స్‌ తర్వాత ఈ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. దర్శకుడు మారుతి కాల్‌ చేసి ఈ సినిమాలోని నా క్యారెక్టర్‌ గురించి చెప్పారు. నాకు చాలా నచ్చింది. వెంటనే చేయాలని డిసైడ్‌ అయ్యాను.
– ఇందులో నా క్యారెక్టర్‌ పేరు గౌరీ. బ్యాంక్‌ ఎంప్లారు. నిజ జీవితంలో మా అమ్మ, నాన్న కూడా బ్యాంకు ఉద్యోగులే కావడంతో ఈ క్యారెక్టర్‌ నాకు పర్సనల్‌గా కనెక్ట్‌ అయ్యింది. సింగిల్‌ మదర్‌, స్ట్రాంగ్‌ ప్రిన్సిఫుల్స్‌ ఉన్న మహిళ క్యారెక్టర్‌ నాది. మదర్‌తో పాటు ఒక సిస్టర్‌లా కనిపించేలా నా క్యారెక్టర్‌ని డైరెక్టర్‌ తీర్చిదిద్దారు. సినిమా ఆద్యంతం నా క్యారెక్టర్‌ ఉంటుంది. తల్లీ కొడుకుల బంధం సినిమాకి సోల్‌గా ఉంటుంది. ఈ సినిమాకి నా క్యారెక్టర్‌ ఎమోషనల్‌ యాంకర్‌లా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో సింగీతం శ్రీనివాసరావు, లీలా పాత్రల మధ్య నడిచే కథ కూడా అందంగా ఉంటూ అందర్నీ కచ్చితంగా అలరిస్తుంది.