పంచాయతీ బోరు పక్కనే ప్రయివేట్‌ వెంచర్‌ బోరు తవ్వకం

– అడ్డుకున్న పంచాయతీ అధికారి, గ్రామస్తులు
నవతెలంగాణ-మొయినాబాద్‌
గ్రామపంచాయతీ బోరు పక్కనే ప్రయివేట్‌ వెంచర్‌కు సంబంధించిన బోరు వేస్తుండగా, ఆ బోరును వేయవద్దని మంగళవారం గ్రామస్తులు ఆందోళన చేపట్టి, అడ్డుకున్నారు. మండలంలోని పెద్ద మంగళారం అనుబంధ గ్రామమైన చిన్నషాపూర్‌ గ్రామంలో ఓ ప్రయివేట్‌ వెంచర్‌ యజమాని గ్రామానికి నీటిని అంది స్తూ, వేసవికాలంలో కూడా గ్రామస్తుల దాహార్తిని తీర్చారు. ఆ గ్రామపంచాయతీ బోరు పక్కనే అక్రమంగా వెలిసిన ప్రయివేట్‌ వెంచర్‌లో రాత్రికి రాత్రే వెంచర్‌ యజమాని కుట్ర పూరితంగా గ్రామపంచాయతీ బోరుకు అతి సమీపంలో రెండు బోరు బావులను బోరు మోటర్‌ ద్వారా తవ్వి స్తుండగా, గమనించిన గ్రామస్తులు అధికారులకు సమా చారం అందించారు. వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటయ్య ఆ ఘటనా స్థలానికి చేరుకుని, అనుమతి లేకుండా వాల్టా చట్టానికి వ్యతిరేకంగా గ్రామపంచాయతీకి సంబంధించిన బోరు పక్కన, బోరు వేయకూడదన్నారు. ప్రయివేట్‌ వ్యక్తులు కనీస నిబంధనలు పాటించకుండా బోరు వేయకూడదని సంబంధించిన అధికారుల ద్వారా అనుమతి పత్రాన్ని పొందితేనే గానీ ఏలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని గ్రామస్తులతో కలిసి అడ్డు కున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లా డుతూ గ్రామ చుట్టుపక్కల అక్రమంగా వెలు స్తున్న వెంచర్లలో, వెంచర్‌ యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ వెంచర్‌ నిర్మాణాలు, బోరుబావి తవ్వకాలు, అసాంఘిక కార్యకలాపాలు, వెంచర్‌ నిర్మాణదారులు చేపడు తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఈ వ్యక్తులపై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియేడల జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి, తమ సమస్యలపై ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య కారొబార్‌ మల్లేష్‌, గ్రామస్తులు బొక్క రంగారెడ్డి, మహేం దర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాఘవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.