అంగరంగ వైభవంగా దేవత మూర్తుల ఊరేగింపు

– ఏక రూప దుస్తులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
నవతెలంగాణ కంఠేశ్వర్
అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్మిణి పాండు రంగ విఠలేశ్వర దేవత ప్రతిష్ట పున:శ్చరణ మహోత్సవం సందర్భంగా మాక్లూర్ గ్రామంలో ఎమ్మెల్యే  గణేష్ బిగాల ,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ టిఆర్ఎస్ పార్టీ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల  కుటుంబ సభ్యులు వారి నివాసం నుండి దేవత మూర్తుల ఊరేగింపు సోమవారం సాయంత్రం నిర్వహించారు. కేరళ కళకారుల బృందం, పండరీ పూర్ కళకారుల నృత్యంతో పాటుగా ఒగ్గు డోలు చప్పుళ్ళ నడుమ అయ్యప్ప, ఆంజనేయ, విటలేశ్వర మరియు శివ నామ స్మరణ చేస్తు భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల  మాట్లాడుతూ….మా తాత బిగాల గంగారాం  మాక్లూర్ గ్రామంలో విటలేశ్వర ఆలయాన్ని నిర్మించి పందారిపూర్ నుండి దేవత మూర్తుల విగ్రహాలు తెప్పించారు.మా నాన్న  బిగాల కృష్ణ మూర్తి  విగ్రహాలను ప్రతిష్టించారు. పాత గుడి స్థానంలో కొత్తది నిర్మించాలని మా నాన్న  సంకల్పించారు.మా నాన్న  మా సోదరుడు నేను అయ్యప్ప స్వామి మాల ధారణ చేసాము.స్వతహాగా అయ్యప్ప భక్తులము.మా నాన్న  సంకల్పం మేరకు మేము అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్మిణి పాండు రంగ విఠలేశ్వర ఆలయాలను నిర్మించాము.రామలయము నిర్మించే బాధ్యత కూడా మా కుటుంబం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్మిణి పాండు రంగ విఠలేశ్వర ఆలయాలలో నిత్య పూజలు ,దైవ ఆరాధనలు నిర్వహించాలని మీ అందరిని కోరుతున్నాను.దేవత మూర్తుల ఊరేగింపు నకు వచ్చిన భక్తులకు దైవ అనుగ్రహం పొందాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతూ కిరణ్ ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ లు, గ్రామ నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.