– కేటీఆర్ హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభం కావడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఈ పార్క్ రాష్ట్రానికి ఎంతో సంపద సష్టించే వనరు కానున్నదని తెలిపారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. హైదరాబాద్‌ను మెడికల్ ఎక్విప్‌మెంట్ల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నలక్ష్యంతో ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. ఆ పార్క్‌లో ఏర్పాటైన సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో మొట్ట మొదటి సారిగా స్టెంట్‌లను ఉత్పత్తి చేసిందని తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్‌లు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి కానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.