– ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలో పొద్దుతిరుగుడు పంట ఆశ జనగంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కందకుర్తి నీలా శివారులో సుమారుగా 150 ఎకరాలలో రైతన్నలు పొద్దు తిరుగుడు పంటను పండించారు. ఈ ఏడాది పొద్దుతిరుగుడు పంట ఆశ జనకంగా ఉందని వారు పేర్కొన్నారు . ఎకరానికి సుమారు 9 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వారన్నారు. ఈ సంవత్సరం పొద్దుతిరుగుడు పంటకు అనుకూల వాతావరణం ఉందని, ఈ పంట పండించిన రైతులకు ఈసారి లాభాలు వచ్చే అవకాశం ఉందని వారి పేర్కొన్నారు. దుక్కి దున్ని పంట చేతికి వచ్చేవరకు సుమారుగా ఎకరానికి 25 వేల రూపాయల వరకు ఖర్చు అయ్యిందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాల్కు 6700 వరకు మద్దతు ధర ప్రకటించినది, నీలా సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్ పేర్కొన్నారు.
నీలా సింగిల్విండో ఛైర్మన్ ఇమామ్ బేగం (రైతు) : గత రెండు మూడు సంవత్సరాలుగా పొద్దుతిరుగుడు పంట అంత లాభదాయకంగా లేకపోవడంతో రైతులు ఈ పంట పై ఆసక్తి చూపలేదని, ఈ ఏడాది అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఈ పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో రైతుల ఆనందం వేల్లి విరుస్తుందన్నారు. 25 వేల రూపాయల పెట్టుబడులు పెడితే కనీసం 10 క్వింటాలకు 30 నుంచి 35 వేల రూపాయల వరకు రైతుకు లాభం చేకూరుతుందన్నారు.
నీల రైతు ( కరిముద్దిన్): నీల గ్రామానికి చెందిన రైతు కరీముద్దన్ మాట్లాడుతూ తన 5 ఎకరాల భూమిలో (అడ్వెంట) అనే రకం పొద్దుతిరుగుడు పంటను వేశానని, ప్రస్తుతం తన పొలంలో ఈ పంట ఆ శాజన కంగానే దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే తమకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.