కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్ 
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  ఆదేశాల మేరకు  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  ఆధ్వర్యంలో సోమవారం   పట్టణం లోని అంబేద్కర్  విగ్రహం ముందు నిరసన  కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జితో పాటు మాజీ గ్రంథాలయ ఛైర్మెన్ మారా చంద్ర మోహన్  మాట్లాడుతూ,కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ ప్రాంత బిజెపి ఎంపీలు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ,ఇద్దరు కేంద్ర మంత్రులగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్రు.అయిన కూడా  ఎంపి అరవింధ్ గతంలో చెప్పినట్టు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ,మిలిటరీ సైనిక్ స్కూల్స్ అని వాగ్ధానం చేయడం జరిగింది.దాన్ని గురించి బడ్జెట్ లో ప్రస్తావన లేదు.ఏదైతే మా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ప్రకటించిందో దాని నేనే తీసుకొచ్చిన అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గొప్ప చెప్పుకుంటాడు. ఎక్కడైతే బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అట్లనే ఎలక్షన్లు బీహార్ లో గాని ఢిల్లీలో గాని ఇదేకాక పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధిక బడ్జెట్ కేటాయించడం జరిగింది .అలా ప్రకటించిన చాలా సంతోషం కానీ దానికి ఒక్క రూపాయి ఇస్తే మా తెలంగాణకి పవల నిధులైన పెట్టలే. మల్ల ఇక్కడ ఉన్న బిజెపి కార్యకర్తలు,నాయకులు గొప్ప  చెప్పుకుంటారు. దీనికి ఎంపి అరవింద్ని ప్రశ్నిస్తున్నాం.
అదే విధంగా  నుంచి అదిలాబాద్ కి రైల్వే లైన్ కోసం సంబంధించిన ఎన్నో సంవత్సరాలు నుంచి నడుస్తుంది దానికి ఒక రూపాయి పెట్టలే,ఈ అరవింద ఆరు సంవత్సరాల నుంచి ఏం చేసిందంటే ఏంది గాడిద గుడ్డు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్న.అట్లనే దేశ ప్రధాని ఉన్నారు నరేంద్ర మోడీ  అన్ని రాష్ట్రాలని సమానత్వంలో తీసుకొని అన్ని రాష్ట్రాలను అభివృద్ధి లో సమానంగా చూడాలని హెచ్చరించడం జరిగింది. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. గత పాలకులు వెళ్లి అడిగే పరిస్థితి లేకుంటే కానీ మా ముఖ్యమంత్రి  గానీ మా మంత్రులు గాని ఈ గడిచిన 14 నెలల్లో ఎన్నోసార్లు పోయి ప్రధానమంత్రిని,కేంద్రమంత్రులను అడిగి ఈ రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పి అడగడం జరిగింది. కానీ మొన్న జరిగిన బడ్జెట్లో ఎక్కడ కూడా రూపాయి ఇవ్వకుండా ఏదైతే పక్క రాష్ట్రంలో ఇచ్చింది దాంట్లో ఒక చరణ మందం  ఇస్తారేమో అని ఆశించడం జరిగింది. కానీ అది కూడా ఇయ్యలేదు తప్పకుండా నేను ఈ బిజెపి పార్టీని గానీ ఇక్కడున్నా నాయకులకు చెప్తున్నా ఇది మొదలైంది ,ఎట్టి పరిస్థితుల మిమ్మల్ని గ్రామాలలో తిరిగినిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం.ఇది ఇక్కడనే కాదు గ్రామ గ్రామాలలో,మండల స్థాయిలలో ఇలాంటి ధర్నాలు ఏ రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు అని ప్రతి గ్రామాలలో తీసుకపోవాల్సిందిగా కోరుతూ,రానున్న రోజుల్లో గ్రామాలలో ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లు ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీని విజయం వైపు గెలిపించే విధంగా పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిర్ధపల్లి సాయి రెడ్డి ,మార్కెట్ యార్డు చైర్మన్  సాయి బాబా గౌడ్, ఆర్మూర్, నందిపేట్ మక్లూర్,డొంకేశ్వర్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, మంద మహిపాల్, రవి ప్రకాష్, భూమేష్ రెడ్డి   బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇస్సపల్లి జీవన్ , నిజామాబాద్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్  ఇంద్రుడు ,డైరెక్టర్ డిసిసి డెలిగేట్ దేగం గంగారెడ్డి  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రామ్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నాభాయ్, లింగ గౌడ్  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందేశ్ శ్రీనివాస్  ,పెర్కిట్ సొసైటీ చైర్మన్ భోజ రెడ్డి, కౌన్సిలర్లు రవి గౌడ్, ఇంతియాజ్ అతిక్, ఫయాజ్, రెహమాన్ ,యూత్ కాంగ్రెసు నియోజవర్గ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్  మండల అధ్యక్షులు రాకేష్  మాక్లూర్ మండల అధ్యక్షులు వినోద్  నిఖిల్  నాయకులు పాల్గొన్నారు.