
భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మణిపూర్ మారణ హోమంపై సంఘీభావంగా సోమవారం స్థానిక మండల సమితి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక మూడు రోడ్ల కూడలిలో గల సయ్యద్ మియా జానీ భవన్ నుంచి బస్టాండ్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా ఎండిఒ పూర్వ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం పాల్గొని ప్రసంగించారు. మన భారత దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశమని కానీ మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ పాలనలో గత రెండున్నర మాసాలు నుంచి ఆడపిల్లలపై అల్లరి మూకలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆడపిల్లలను నగ్నంగా ఊరేగించి మూకుమ్మడిగా మానభంగాలు కు గురిచేసి అతి దారుణంగా కిరాతకంగా ముక్కల ముక్కలుగా నరికి హత్య చేస్తున్నారని ఇదే బీజేపీ పార్టీ మళ్లీ గనుక అధికారంలోకి వస్తే భారతదేశం రాష్ట్రాలు మొత్తం మణిపూర్ లానే మారి పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా భారత దేశ ప్రజలు ఈ విషయాలపై దృష్టి సాధించి మతతత్వ బిజెపి పార్టీని గద్దె దించి లౌకిక ప్రజాస్వామ్య పార్టీలను అధికారంలో తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గాన్నిన రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి సయ్యద్ రఫీ, మహిళా నాయకురాలు చీపుర్ల సత్యవతి, షేక్ రిజ్వానా, షేక్ షమ్మీ,కుమారి, ఎ.ఐ.టి.యు.సి లారీ యూనియన్ నాయకులు షేక్ రహంతుల్లా, షేక్ నాగూర్, సయ్యద్ జాకీర్, పిల్లం బత్తయ్య, షేక్ సైదా, శీలం రాజా,నాగరాజు, పోసి తదితరులు పాల్గొన్నారు.