
మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి కావేరి అంతర్జాతీయ స్థాయిలో కరాటే పోటీలలో రాణించినందున పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ అభినందించారు. మంగళవారం పాఠశాలలో విద్యార్థి కావేరిని అభినందిస్తూ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు తనకు నైపుణ్యం ఉన్న రంగాలలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.