స్వచ్ఛమైన ప్రేమకథ

‘పెళ్లి చూపులు, డియర్‌ కామ్రేడ్‌, దొరసాని’ వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌లో వస్తున్న 6వ చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును అనేది ఉపశీర్షిక. చైతన్యరావు హీరోగా, లావణ్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ప్రొడ్యూసర్‌ సురేష్‌ బాబు ఆవిష్కరించి, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ,’ఈ చిత్రం 1980స్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. దీంతో పాటు కొన్ని ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి’ అని తెలిపారు. ‘ఇది ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమా. అందరూ కొత్తవాళ్లే. ఈ సినిమాకు ప్రధాన బలం కథ. ‘ఓ పిట్టకథ’ చిత్రంతో మెప్పించిన చెందు ముద్దు ఈ కథను బాగా రాసుకున్నారు. ఫన్‌తో పాటు క్రైమ్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ కూడా బాగా కుదిరాయి. స్క్రీన్‌ప్లే చాలా బావుంటుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌, ఎడిటింగ్‌ అన్నీ అద్భుతంగా కుదిరాయి. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’ అని నిర్మాత యష్‌ రంగినేని అన్నారు.