స్వచ్ఛమైన ప్రేమకథ

స్వచ్ఛమైన ప్రేమకథరక్షిత్‌ అట్లూరి హీరోగా, కోమలి హీరోయిన్‌గా ‘శశివదనే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత, దర్శకుడు సాయి మోహన్‌ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని ఏజీ ఫిల్మ్‌ కంపెనీ, ఎస్‌విఎస్‌ స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకాలపై అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్‌ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో ఈ చిత్రం ఎలా ఉంటుంది.. మళ్లీ గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్‌ ఆ పోస్టర్‌ మీద హైలెట్‌గా నిలిచింది. ఆ డైలాగ్‌తో సినిమా సారాన్ని చెప్పేశారు. శశివదనే స్వచ్చమైన గ్రామీణ ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.