జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ తరఫున నిర్మాత వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా శ్రీను, శివనాగు, నిర్మాత వేణుగోపాల్, ఎన్టీఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. ఈనెల 30న ఈ సినిమాని ఐదు భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ, ‘ఇదొక మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా’ అని చెప్పారు. ‘ఫారెన్‌లో షూట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అని ఎన్టీఆర్ శ్రీను చెప్పారు.