– కన్నెత్తి చూడని నీటి పారుదల శాఖ అధికారులు
– వృథాగా పోతున్న నీరు
– అన్నదాతలలో ఆందోళన
నవతెలంగాణ – నిజాంసాగర్
నిజం సాగర్ మండలంలోని అన్ని గ్రామాలలో ని చెరువులు అన్నీ కూడా ఎండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం చెరువులను ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ప్రతి గ్రామంలో యాసంగి పంట కోసం గతంలో అధికారులు వచ్చి పంట సాగు కోసం చెరువు కింద ఎంత సాగు చేయ్యాలో అధికారులు రైతులకు చెప్పి గ్రామాలలో ఉన్నటువంటి V.R.A లకు సాగు కోసం నీళ్లను వదిలే బాధ్యతను వాళ్లకి అప్పజెప్పేవాళ్లు. దీని ద్వారా గ్రామాలలోని V.R.A లు పంట సాగుకు అవసరమయ్యే విధంగా నీటిని వదిలే వాళ్లు కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని చూస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. V.R.A లను గత ప్రభుత్వం వివిధ శాఖలకు బదిలీ చేయడం వలన చెరువులపై పూర్తి అధికారం ప్రజలపై పడింది. దీనివలన ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు నీటిని వదలడం వలన చెరువులలోని నీరు మొత్తం వృధాగా పోతున్నాయి. ఇది ఇలా ఉండగా ఇంత జరుగుతున్నా కనీసం నీటిపారుదల శాఖ అధికారులు చెరువుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదనేది గమనార్హం. జనవరి నెలలోనే చెరువుల నీరు మొత్తం ఖాళీ అవుతున్నాయి. ఇది ఈల ఉంటే కొన్ని గ్రామాలలో ఇప్పుడే నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఇది ఇలానే కొనసాగితే ఎండాకాలంలో భారీగా నీటి సమస్యలను ఎదుర్కోవడం ఖాయమని గ్రామాలలోని ప్రజలు చెబుతున్నారు. కొందరు రైతులు యాసంగి పంట సాగు చేస్తున్నారు. అయితే చెరువు తూము నుండి నీరు వృధాగా పోవడం వలన పంట పూర్తయ్యే వరకు నీరు ఉంటాయో లేక మధ్యలోనే పంట ఎండిపోతుందో అని రైతులు భయాందోళనకి గురి అవుతున్నారు. ఇలానే కొనసాగితే భారీగా నష్టపోతామని మండలంలోని రైతులు చెబుతున్నారు. కొన్ని గ్రామాలలో చెరువు భూమి కబ్జాకు గురి అవుతుందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మండలంలోని రైతులు ఆవుదర వ్యక్తం చేస్తున్నారు.