శరణు వేడిన వాని చెరను విడిపించి
అభయమిచ్చి ఆపన్నహస్తమందించి!
ఆశ్రితులను ఆప్తులుగా
తలచే తపోవనంలో
పూర్వపుణ్య ఫలంగా
తులసి మొక్కవై
ప్రభవించిన ప్రా వసుధైక
కుటుంబ వరిష్ఠుడా!
అర్ధసత్యాల ఆధునికతను
ఆపాదమస్తకం ఆపాదించుకొని
నగ అసత్యాల ఆటవికతను
అనునిత్యం వల్లెవేస్తూ
అత్యాచారమనే
అనాగరిక ఆయుధాన్ని
అనవరతం ప్రయోగిస్తూ
ఆక్రోశిత కంఠాలను అడ్డంగా నరికే
అసురకేళిని ఆనందంగా గ్రోలుతూ…
మధ్యయుగ మందబల మదత్వాన్ని
మళ్ళీ మళ్ళీ నియోగిస్తూ
దుర్భల దుఃఖిత జాతులను
దౌర్జన్యంగా దునుమాడుతూ బరితెగించి!
అబలలను బరిబత్తల ఊరేగిస్తూ
నాగరికతల నడివీధిలో అదశ్యాత్మల
అంగాంగ స్పశ్య ప్రదర్శనగావిస్తూ!
ఆపత్కాలంలో అమాయక గోవులు!
గోమాయువులను ఆశ్రయిస్తే
మాయచేసి! మహితాసురులకు
అప్పనంగా అప్పజెప్పినప్పుడు
సాటి ఆవులు సైతం సర్ది చెప్పాల్సింది పోయి
జాలిలేని జాణతనంతో!
ఉన్మాదంతో ఉరికే ఆంబోతులను
ఉస్కో ఉస్కోమని ఉసిగొల్పినప్పుడు…
కుల మత తెగలమధ్య కుంపటి రగిలించి
ఆధిపత్య ఛత్రానికి అహరహం అర్రులు చాస్తూ
జంతువులుకూడా జడుసుకునే
దారుణ దశ్యాలకు తెరతీస్తూ!
మానవజాతి మనికినే
మటుమాయం చేయడానికి
కంకణం కట్టుకున్న ఓ భస్మాసురా!
మరమనిషికైనా మనసుంటుంది!
మరి నీకో….??
– కరిపె రాజ్‌కుమార్, 8125144729