స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత విశేషాల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘బాబు జగజ్జీవన్ రామ్’. ఈ చిత్రాన్ని పెదరావూరు ఫిలిం స్టూడియోస్, తెనాలి బ్యానర్ పై దర్శకుడు దిలీప్ రాజా రూపొంది స్తున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ పాత్రలో మిలటరీ ప్రసాద్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా షూటింగ్ విశేషాలను ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రబదం వివరించింది.
దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ, ‘బాబూ జగజ్జీవన్ రామ్ సేవల గురించి ప్రేక్షకులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. జగజ్జీవన్ రామ్ వర్థంతి అయిన జూలై 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 40 ఏళ్లు కేంద్రమంత్రిగా, 50 ఏళ్లు పార్లమెంటే రియన్‌గా దేశానికి సేవలు అందించి చరిత్ర సష్టించారు జగజ్జీవన్ రామ్. గాంధీజీ, నేతాజీ, లాల్ బహదూర్ శాస్త్రి, చంద్రశేఖర్ ఆజాద్ పాత్రలు ఉంటాయి. జగజ్జీవన్ రామ్ కుమార్తె లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాత్రలో తాళ్లూరి రామేశ్వరి నటిస్తున్నారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో ఈ అరుదైన బయోపిక్‌ని రిలీజ్‌కు తీసుకొస్తాం’ అని చెప్పారు.