ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాన్ని అందుకున్న సీతారామం చిత్ర బృందానికిమరో అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్‌బి) అవార్డుల్లో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో చిత్ర దర్శక, నిర్మాతలు ఉత్తమ చిత్ర అవార్డును అందుకున్నారు.