
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలోని నారాయణ పురం కు చెందిన కలపాల మంగ రాజు అనే యువకుడు అయిన దళిత విద్యావంతుడు కు అరుదైన గౌరవం దక్కింది.బుద్ధుడు పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో 9 సంవత్సరాలుగా తన వ్యక్తిగత జీవితం వదిలేసి సమాజంలో నీ అసమానతలను తొలగించుట కై ఎంతో కృషి చేస్తున్న కలపాల మంగ రాజు బహుజన సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.
ఫిబ్రవరి 11 2024 న తిరుపతిలో జరిగే బహుజన సాహిత్య అకాడమీ అవార్డు ప్రధానం చేయనున్నారు.ఈ మేరకు ఇటీవల ఎంపిక పత్రాన్ని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ మంగ రాజు కు అందజేసారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం నారాయణపురం కు చెందిన ప్రముఖ బహుజన విప్లవకారుడు,స్వేరో సైనికుడు,అక్షరం,ఆరోగ్యం, ఆర్థికం,అధికారం అనే నాలుగు అంశాలను నిరంతరం దళిత, బహుజన ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్లో సామాజిక పరివర్తన తీసుకురావడం కొరకు గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ బుద్ధుడు – పూలే – అంబేద్కర్ ఆలోచన విధానం ను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ,యువకులు ఏ మార్గంలో నడవాలి,ఎవరి మార్గంలో నడిస్తే మనం ఉన్నత స్థానాలకు వెళ్తాం అనే అంశాలను ప్రజలకు నిత్యం చెప్తున్న వ్యక్తిగా, బహుజన వాదిగా ముద్ర వేసి కొని మార్చ్ 15 కాన్సీరాం గారి జయంతి నుంచి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్ష చేస్తూ,ఎంతో మంది యువతను మహనీయుల త్యాగాల గురించి వివరిస్తూ సైకిల్ యాత్ర రూపంలో అఖండ భారతాన్ని పరిపాలించిన బుద్ధుడు,పూలే అంబేద్కర్ ను ప్రచారం చేయడం లాంటివి చేస్తూ ఉన్నాడు.ఇది గమనించిన బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఆఫ్ ఇండియా ఈయన సామాజిక సేవలను గుర్తించి ఈ బహుజన సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేసింది.ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని జాతీయ కార్యాలయంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ అయిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక పత్రాన్ని మంగ రాజుకు అందజేసి అభినందించారు. ఫిబ్రవరి 11న ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ ఏడవ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును కలపాల మంగ రాజు కి అందజేయనున్నట్లు నల్ల రాధాకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు.అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ బాధే వెంకటేశం తో పాటు రాష్ట్ర కమిటీ సూచనలతో కలపాల మంగరాజు బహుజన ఐడియాలజీ ని,బహుజన, తెలంగాణ ఉద్యమ సేవలను వాటి ఫలితాలను పరిశీలించిన అనంతరం అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, తమిళనాడు,కేరళ,కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారుగా 600 మంది ప్రతినిధులు( డెలిగేట్స్) ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతారని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎం గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ అనుమాండ్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు.