
నవతెలంగాణ – రామగిరి
గుండారం గ్రామానికి చెందిన కమాన్పూర్ మండల సీనియర్ విలేఖరి జబ్బర్ ఖాన్ ను సన్మానించిన లొంక కేసారం తాజా మాజీ సర్పంచ్ ఎండి మంజూర్.ఇటీవల గోదావరిఖనిలో డాన్స్ మాస్టర్లు దేవా,వీర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిట్ బిట్ డ్యాన్స్ అకాడామీ వార్షికోత్సవం కార్యక్రమంలో జబ్బర్ ఖాన్ ఉత్తమ విలేఖరిగా అవార్డు అందుకున్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రామగిరి మండలం లొంక కేసారం తాజా మాజీ సర్పంచ్ ఎండి మంజూర్ సీనియర్ పాత్రికేయులు జబ్బర్ ఖాన్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మంజూర్ మాట్లాడుతూ, జబ్బర్ ఖాన్ గత 30 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో ఉంటూ విశిష్ట సేవలు అందించారని అన్నారు.ఈమధ్య నూతనంగా నియామకమైన విలేఖరులు జబ్బర్ ఖాన్ ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వారి వెంట ఎండి అలీం పాషా, మోయిజ్ పాషా,మోతిన్ ఖాన్, నేరెళ్ల ప్రదీప్ ఉన్నారు.