హీరో నారా రోహిత్ నటిస్తున్న తన 20వ చిత్రం ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. టీజర్ లాంచ్‌తో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ, ‘ఇదొక పెక్యులర్ లవ్ స్టొరీ. నా కమ్ బ్యాక్ మూవీగా ఈ స్క్రిప్ట్‌నే లాక్ చేశాం. ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్. వెంకీ బ్రిలియంట్‌గా కథ రాశారు. టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లియాన్ జేమ్స్ మంచి ఆల్బమ్ ఇచ్చాడు. మంచి పాటలు కుదిరాయి’ అని అన్నారు. ‘ఈ కథని ఓకే చేసిన రోహిత్‌కి థ్యాంక్స్. ఆయనే దీన్ని ముందుంచి నడిపించారు. వెంకీ పెద్ద డైరెక్టర్ అవుతారు’ అని నిర్మాత సంతోష్ చిన్నపొల్ల చెప్పారు. డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి,’ఇది నా ఫస్ట్ స్టేజ్. ఈ అవకాశం ఇచ్చిన రోహిత్‌కి థ్యాంక్స్. టీజర్ మాదిరిగానే ఇంతే క్లీన్, నీట్‌గా సినిమా ఉంటుంది. సినిమా చూసి నవ్వుకుని, కొన్ని మంచి మెమరీస్ ఇంటికి తీసుకెళతారు’ అని తెలిపారు. ‘ఇంతమంచి అవకాశం ఇచ్చిన రోహిత్‌కి థ్యాంక్స్. ఈ సినిమా మాకు ఎక్స్‌లెంట్ ఎక్స్‌పీరియన్స్’ అని సహ నిర్మాతలు రాకేష్ మహంకాళి, గౌతమ్ రెడ్డి తెలిపారు.