ఆశ హాస్పిటల్ లో అరుదైన శాస్త్ర చికిత్స

నవతెలంగాణ – ఆర్మూర్
పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ పేరుందిన పట్టణంలోని పెర్కిట్ రోడ్లో గల ఆశ హాస్పిటల్ వైద్యులు అరుదైన శాస్త్ర చికిత్స చేసి వైద్య నారాయణ హరి అనిపించుకున్నారు. క్యాన్సర్ గడ్డతో బాధపడుతూ దోమకొండకు చెందిన చంద్రం అనే వ్యక్తి 57 సంవత్సరాలు. ఆపరేషన్ చేసి క్యాన్సర్ కారక కొవ్వు గడ్డలను తీసివేసినారు ఈ సందర్భంగా లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ బాల్ రడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకు ఆపరేషన్లు చేయడం ఆశ హాస్పిటల్ ప్రత్యేకత అని అన్నారు.. నిర్విరామ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు డాక్టర్ శేఖర్ రెడ్డి తదితరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..