విద్యార్థులకు చదువే ఆయుధం..

– విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం
– నాడు ఒకే కాలేజ్..నేడు 30 కాలేజీలు..
– 21న నిజాంసాగర్ నీటి విడుదల
– స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-నసురుల్లాబాద్ (బీర్కూర్)
విద్యార్థులకు చదువే ఆయుధమని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా బాన్సువాడ డివిజన్ పరిధిలోని బీర్కూర్ మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ విద్యాదినోత్సవంలో ముఖ్య అతిధిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో రూ. 1.61 కోట్లతో నూతనంగా అభివృద్ధి చేసిన మౌళిక వసతులు మరియు నిర్మించిన 12 అదనపు తరగతి గదులు ప్రారంభోత్సవం. మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో రూ. 92.83 లక్షలతో అభివృద్ధి చేసిన మౌళిక వసతులు మరియు 7 అదనపు గదులు ప్రారంభోత్సవం. ఉర్ధూ మీడియం పాఠశాలలో రూ.33 లక్షలతో నూతనంగా నిర్మించిన 3 అదనపు తరగతి గదులు ప్రారంభోత్సవం. రూ. 27 లక్షలతో నూతనంగా నిర్మించిన 3 అంగన్వాడీ భవనాలు ప్రారంభోత్సవంలు చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ వానాకాలం పంటల సాగుకు డోకా లేదు. 21న ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామన్నరు. విద్యా వ్యవస్థను బలోపేతం చెయ్యడం కోసం మన ఊరు-మన బడి మొదటి విడుతలో ప్రతి మండలానికి నాలుగు పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కలిగేందుకు కృషి చేస్తామన్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని వివరించడానికే ఈ ఉత్సవాలు అని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో మనిషికి జ్ఞానం కలుగుతుంది, మంచి చెడులు తెలుస్తాయి. మంచి నడవడిక అలవాటవుతాయన్నారు. సమాజం విద్యావంతుల సమాజంగా తయారు కావాలన్నారు. గతంలో పాఠశాలలో మౌళిక వసతులు లేవు. చెట్ల కింద, గుడిసెలలో చదువులు కొనసాగేవి. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్ననాని స్పీకర్ అన్నారు. గతంలో రోజుల్లో పేదలు మంచి స్కూళ్లలో, కాలేజీలలో చదువుకోవడానికి ఆర్ధిక స్తోమత ఉండేది కాదు. పట్టణాలలోని ధనవంతుల పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్య మారుమూల ప్రాంతాల్లోని పేదల పిల్లలకు కూడా అందాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం అన్నారు. ఈ ఏడాది విద్యాశాఖ బడ్జెట్ రూ. 19,093 కోట్లు రాష్ట్రంలో గురుకులాల సంఖ్య 1002, వీటిలో చదివే విద్యార్థుల సంఖ్య 5.59 లక్షలు. గురుకులాల బడ్జెట్ 784 కోట్ల నుండి 3,400 కోట్లకు పెరిగిందన్నారు. కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ప్రజాప్రతినిధులు విద్యాలయాలను నిత్యం సందర్శించాలని. అప్పుడే నాణ్యత పెరుగుతుందన్నారు. కంప్యూటర్ రంగంలో నేడు హైదరాబాద్ దేశంలో నెంబర్ వన్. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమర్ధతతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయన్నారు. చదువుకున్న యువతకు ప్రవేటు రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యాలయాలలో మౌళిక వసతులు కల్పించడం మా బాధ్యత, విద్యార్థులకు చదువు బోదించి వారిని ప్రయోజకులను చేయడం ఉపాద్యాయులుగా మీ బాధ్యత అని అన్నారు.
నాడు ఒకే కాలేజ్..నేడు 30 కాలేజీలు..
బాన్సువాడ నియోజకవర్గం నుంచి 1994 లో మొదటిసారిగా శాసనసభ్యుడు అయినప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో కేవలం ఒక్కటే జూనియర్ కాలేజి మాత్రమే ఉండేది. ఇప్పుడు అన్ని కాలేజీలు కలిపి 30 ఉన్నాయి. ఉర్ధూ మీడియం జూనియర్, డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేసాం. ప్రభుత్వ Bsc నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం. జూన్ 26 నుంచి వానాకాలం రైతుబంధు నిధులు రైతులకు అందుతాయి. అవసరమైతే కొండపోచమ్మ సాగర్ నుండి 5 టీఎంసిల గోదావరి నీళ్ళను నిజాంసాగర్ ప్రాజెక్టుకు వదలమని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎంపిపీ రఘు, మాజీ జడ్పిటిసి సతీష్, అంజిరెడ్డి, వైస్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అశోక్, జడ్పిటిసి స్వరూప శ్రీనివాస్, గాంధీ, ఎంపిటిసి సందీప్, మండల కో ఆఫ్షన్ మెంబర్ అరిఫ్, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.