విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎ2బి ఇండియా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత రజిత్ రావు నిర్మించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని, సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో సన్నీ మాట్లాడుతూ,’చూసిన ప్రేక్షకులందరూ సినిమా బాగుంది, చాలా బాగా ఎంజారు చేశామని చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కతజ్ఞతలు’ అని చెప్పారు.
దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ, ”అన్ స్టాపబుల్’ని మంచి సినిమా అని ప్రేక్షకులు మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. హాయిగా నవ్వించాలానే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. పబ్లిక్ టాక్ అద్భుతంగా ఉంది. ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన తీర్పు రియల్ బ్లాక్ బస్టర్’ అని అన్నారు. ‘బాలయ్య బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ‘అన్ స్టాపబుల్’ అని ఆయన టైటిల్ తీసుకున్నాం. బాలయ్య బాబు ఏది పట్టుకున్న బంగారం అవుతుంది. మా ప్రొడక్షన్లో తొలి సినిమాకి ఆయన టైటిల్ ఉండటం ఆనందంగా ఉంది. ‘అన్ స్టాపబుల్’ రియల్ బ్లాక్ బస్టర్. ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. డైమండ్ రత్నబాబు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్రేక్షకుల నుంచి ఎక్స్టార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారాను. ‘అన్ స్టాపబుల్’ని రియల్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కతజ్ఞతలు. ‘అన్ స్టాపబుల్’2ని మళ్ళీ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో చేస్తున్నాం’ అని నిర్మాత రజిత్ రావు అన్నారు.